Eenati Varaku - Shaan

Eenati Varaku

Shaan

00:00

04:36

Similar recommendations

Lyric

Are you in love

Are you in love

Are you in love

ఈనాటి వరకు నా గుండెలయకు

ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా

ఈ తీపిదిగులు మొదలైంది మొదలు

ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా

ఈనాటి వరకు, నా గుండెలయకు

ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా

ఈ తీపిదిగులు మొదలైంది మొదలు

ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా

అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే

ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే

మనసా

ఈనాటి వరకు, నా గుండెలయకు

ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా

Are you in love

Are you in love

ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే

ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే

ఎంతమాత్రం నమ్మనంటూ నాలో నేను నవ్వుకుంటే

నన్ను సైతం వదలనంటూ వచ్చి కమ్ముకుందే

కథలు విన్నా ఎదరే ఉన్నా అసలు సంగతి తేలదుగా

అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా

ఈనాటి వరకు నా గుండెలయకు

ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా

ఒక్కచోటే కలిసి ఉన్నా తనతోపాటు ఇంతకాలం

ఒక్కపూటా కలగలేదే నాకిలాంటి భావం

ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంతదూరం

ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం

కంటపడని ప్రాణంలాగా గుండెలోనే తానున్నా

జ్ఞాపకాలే తరిమేదాక గురుతురాలేదే

ఈ తీపిదిగులు మొదలైంది మొదలు

ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా

- It's already the end -